Puthalapattu: కూటమి అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే మురళి మోహన్!
Puthalapattu: చిత్తూరు జిల్లా పూతలపట్టులో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళి మోహన్. కూటమి అభ్యర్థులను గెలిపించాలని పిలుపు.
Puthalapattu: కూటమి అభ్యర్థుల గెలుపుతోనే గ్రామాల అభివృద్ధి: ఎమ్మెల్యే మురళి మోహన్!
Puthalapattu: స్థానిక జడ్పిటిసి,ఎంపిటిసి ఎన్నికలలో కూటమి అభ్యర్థులను గెలిపించి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రజలను కోరారు. ఆదివారం స్థానిక ఎన్నికల ప్రచారంలో భాగంగా ఐరాల మండలంలోని బొమ్మ సముద్రం సెగ్మెంట్ పుత్ర మద్ది సెగ్మెంట్ కామినేనిపల్లి సెగ్మెంట్ లందు ఇంటింటికి వెళ్లి విస్తృత ప్రచారం ఎమ్మెల్యే నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబునాయుడు గారు ప్రజల అభివృద్ధి కొరకు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేశారన్నారు. మహిళల అభివృద్ధిలో భాగంగా ఆర్టిసి ఉచిత ప్రయాణం మొదలుకొని రైతుల అభివృద్ధి వరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందన్నారు.
ఐరాల మండలంలో టిడిపి పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీటీసీ అభ్యర్థులను, జనసేన పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మహేష్ స్వేరో ని గ్లాస్ గుర్తుపై ఓట్లు వేసి అఖండ విజయంతో గెలిపించాలన్నారు
పంచాయతీ నందు త్రాగునీరు సిసి రోడ్లు పరిసరాల పరిశుభ్రత మరింతగా మెరుగు పడాలంటే కూటమి ప్రభుత్వాన్ని ఆదరించి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో కాణిపాక దేవస్థానం చైర్మన్ మనీ నాయుడు, ఐరాల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గంగారపు హరిబాబు నాయుడు, ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ అధ్యక్షులు గిరిబాబు నాయుడు, క్లస్టర్ ఇన్చార్జి మోహన్ నాయుడు మహిళా సీనియర్ నాయకురాలు లతా, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.




