Puthalapattu: మొగిలీశ్వరాలయం అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు!

Puthalapattu: బంగారుపాళ్యం శ్రీ మొగిలీశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు: అక్టోబర్ 1న నూతన కమిటీ ప్రమాణ స్వీకారం, విజయవంతం చేయాలని టీడీపీ నేతల పిలుపు.

VASU, PUTTALAPATTU
Published on: 27 Sept 2026 5:53 PM IST
Puthalapattu
X

Puthalapattu: మొగిలీశ్వరాలయం అభివృద్ధికి రూ. 2 కోట్లు మంజూరు!

పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం, బంగారుపాళ్యం మండలం, మొగిలి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శ్రీకామాక్షి సమేత మొగిలీశ్వర స్వామివారి అభివృద్ధి కొరకు కూటమి ప్రభుత్వం కమిటీని నియమించింది. కమిటీ ప్రమాణ స్వీకారం అక్టోబర్ 1వ తేదీ గురువారం మొగిలి ఆలయ ఆవరణంలో నిర్వహించబడునని టిడిపి నాయకులు మీడియా సమావేశంలో తెలిపారు.

ఆదివారం టిడిపి మండల కార్యాలయంలో మీడియా సమావేశంలో టిడిపి గౌరవ అధ్యక్షులు ఎన్.పి.జయప్రకాష్ నాయుడు మాట్లాడుతూ పురాతన మొగిలి గుడి అభివృద్ధికి నోచుకోకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం రాగానే ఎమ్మెల్యే చొరవతో గుడి అభివృద్ధి కోసం 2కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు.

అందరి సమిష్టి కృషితో ఆలయంకు పూర్వ వైభవం తీసుకురావాలని కోరారు. మండల టిడిపి కన్వీనర్ ఎన్.పి.ధరణి ప్రసాద్ మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.కాబోయే ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ కమలనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రమాణ స్వీకారం కు మండలంలోని ప్రతి గ్రామం నుండి ప్రతి ఒక్కరూ విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU