Puthalapattu: బంగారుపాళ్యంలో రూ. 8.45 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

Puthalapattu: పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలంలో రూ.8.45 కోట్లతో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ ప్రారంభించారు.

VASU, PUTTALAPATTU
Published on: 8 Oct 2026 9:18 PM IST
Puthalapattu
X

Puthalapattu: బంగారుపాళ్యంలో రూ. 8.45 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం

పూతలపట్టు: పూతలపట్టు నియోజకవర్గం బంగారు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.

పూతలపట్టు నియోజకవర్గ ప్రగతి పథం.. బంగారుపాళ్యం మండలంలో రూ. 8.45 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్.

బంగారుపాళ్యం మండలలో రూ.8.45 కోట్ల భారీ వ్యయంతో పూర్తయిన సరికొత్త బీటీ రోడ్లు, సీసీ రోడ్లు, మరియు చిన్నారుల కోసం నిర్మించిన అంగన్‌వాడీ భవనాలను అధికారికంగా ప్రారంభించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీ మోహన్.

ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ,మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ ధరణి ధర నాయుడు, జిల్లా తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం మహిళా కార్యకర్తలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU