Puthalapattu: పూతలపట్టులో 37 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ భారీ భద్రత

Puthalapattu: పూతలపట్టు నియోజకవర్గంలో నవంబర్ 5న 37 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు. 144, 163 సెక్షన్లు అమలులో ఉన్నాయని, దొంగ ఓట్లపై కఠిన చర్యలని సీఐ హెచ్చరిక.

VASU, PUTTALAPATTU
Published on: 4 Nov 2026 4:02 PM IST
Puthalapattu
X

Puthalapattu: పూతలపట్టులో 37 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ భారీ భద్రత

పూతలపట్టు: చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐదు మండలాలందు 76 ఎంపీటీసీ స్థానాలు ఉండగా అందులో 37 ఎంపీటీసీలకు 5వ తేదీ ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లా ఎస్పీ తుషార్ దూది ఆదేశాలు మేరకు పూతలపట్టు నియోజకవర్గంలో 37 ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా పూతలపట్టు సీఐ తిమ్మయ్య మాట్లాడుతూ ప్రతి ఎంపీటీసీ పోలింగ్ వద్ద 100 మీటర్లు అవతల నుంచి ఓటర్లు ఓటు వేయడానికి రావాలని తెలిపారు 144 సెక్షన్ తోపాటు 163 సెక్షన్ కూడా అమలులో ఉందని తెలిపారు. గుంపులు గుంపులుగా చేరి అల్లరి చేసే వ్యక్తులపైన చట్టపరముగా చర్యలు తీసుకుంటామన్నారు.

ఓటర్లు తమ యొక్క ఐడెంటి కార్డును తీసుకువచ్చి ప్రశాంతంగా ఓటు వేసి వెళ్లాలన్నారు దొంగ ఓట్లు వేసే దానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఓటు వేసే ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU