Punganur: వైకాపాను వీడి టీడీపీలో చేరిన నెక్కుంది గ్రామస్థులు

Punganur: పుంగనూరులో ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి సమక్షంలో వైకాపాను వీడి టీడీపీలో చేరిన పెద్ద అల్సాపురం, చిన్న అల్సాపురం గ్రామస్థులు.

MAHESH, PUNGANOOR
Published on: 9 Oct 2026 8:20 PM IST
Punganur
X

Punganur: వైకాపాను వీడి టీడీపీలో చేరిన నెక్కుంది గ్రామస్థులు

పుంగనూరు: పుంగనూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పలమనేరు శాసనసభ్యులు శ్రీ నూతనకాల్వ అమరనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నెక్కుంది పంచాయతీ పరిధిలోని పెద్ద అల్సాపురం, చిన్న అల్సాపురం గ్రామాలకు చెందిన పలువురు గ్రామస్థులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైకాపా)ను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి గారు పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, తెలుగుదేశం పార్టీ ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతోందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి మధుసూదన్ నాయుడు, మార్కెట్ కమిటీ చైర్మన్ శమిపతి యాదవ్, నాయకులు మురళీధర్ నాయుడు, సోమల సురేష్, అసూరి బాలాజీ, యదు శేఖర్ నాయుడు, సుహేల్ బాషా, చిన్నా రాయల్, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR