Punganur: మేలుపట్లలో గుర్తుతెలియని మృతదేహం..

Punganur: పుంగనూరు పట్టణంలోని మేలుపట్ల పెట్రోల్ బంక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి శవం లభ్యమైంది. వివరాలు తెలిస్తే పోలీసులకు తెలపాలని కోరారు.

MAHESH, PUNGANOOR
Published on: 29 Oct 2026 10:20 PM IST
Punganur
X

Punganur: మేలుపట్లలో గుర్తుతెలియని మృతదేహం..

పుంగనూరు: పుంగనూరు పట్టణంలోని మేలుపట్ల ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.

మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పుంగనూరు పోలీసులకు సమాచారం అందించారు.దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి,గుర్తింపు కోసం అవసరమైన ఆనవాళ్లను సేకరించారు.

మృతుడి వయస్సు సుమారు(40 )సం || ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతుడు ఒంటి పై నలుపు రంగు టీషర్ట్,నీలం రంగు నైట్ ప్యాంటు ధరించి ఉన్నాడు.అతని కుడి చేతికి కంకణం ఉన్నట్లు గుర్తించారు.

మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా అతడిని గుర్తుపట్టిన వారు పుంగనూరు పోలీసులను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు కోరారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR