Punganur: తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి
Punganur: పుంగనూరుకు తాగునీరు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు నింపాలని డిమాండ్.
Punganur: తాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేసిన ఎంపీ మిథున్ రెడ్డి
పుంగనూరు: జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు పుంగనూరు, మదనపల్లి,పలమనేరు, కుప్పం కు నీరు ఇచ్చారు. ఎల్ నినో ప్రభావంతో ఈ మండలాలని కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించింది. పుంగనూరు కు త్రాగునీరు ఇవ్వకుండా పక్క మండలాలకు కృష్ణ జలాలు పోలీసులను అడ్డుపెట్టుకొని పంపుతున్నారు.
పుంగనూరు నియోజకవర్గం పైన మున్సిపాలిటీ పైన టిడిపి తీవ్రమైన వివక్ష చూపుతుంది. పుంగనూరు,మదనపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులను తక్షణమే ప్రభుత్వం నీరు నింపాలి. రాబోవు మూడు నాలుగు నెలలు ఇంకా తీవ్రమైన కరువు పరిస్థితులు రాబోతున్నాయి.
ఎల్ నినో అని ప్రపంచమంతా మాట్లాడుతుంది..భారతదేశంలో కొన్నిచోట్ల చాలా ఇబ్బందిగా ఉంది. నీళ్లు ఉండేటప్పుడే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులకు నీళ్లు నింపి..ప్రజలకు భరోసా కలిపించాలి. రాజకీయ కక్షలు ఉండొచ్చు..ప్రజలపై కక్ష ఉండకూడదు. పుంగనూరు నియోజకవర్గ ప్రజలపై కక్ష వద్దు..త్రాగునీరు మా హక్కు.
సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఖాళీగా ఉంది.. సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నింపకుండా హంద్రీనీవా జలాలను పోలీసులను ప్రొటెక్షన్ పెట్టుకుని తరలిస్తున్నారు. సాగునీరు అడగడం లేదు త్రాగునీరు అడుగుతున్నాం.. ఎంపీ మిథున్ రెడ్డి..




