Punganur: టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ నాయుతో జనసేన నేతల భేటీ

Punganur: పుంగనూరులో జనసేన నేతలు టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ నాయుడిని కలిశారు. కూటమి ఐక్యత, ప్రజా సమస్యల పరిష్కారంపై సానుకూలంగా చర్చించుకున్నారు.

MAHESH, PUNGANOOR
Published on: 8 Oct 2026 9:11 PM IST
Punganur
X

Punganur: టీడీపీ ఇంచార్జ్ మధుసూదన్ నాయుతో జనసేన నేతల భేటీ

పుంగనూరు: పుంగనూరు జనసేన పార్టీ నాయకులు టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి మధుసూదన్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి కూటమి ఐక్యత, పరస్పర సమన్వయం మరియు నియోజకవర్గ అభివృద్ధి అంశాలపై సానుకూలంగా చర్చించడం జరిగింది.

కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య సమన్వయం మరింత బలోపేతం చేసుకుని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. జనసేన–టీడీపీ నాయకులు, కార్యకర్తలు పరస్పరం సహకరించుకుంటూ ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని చర్చించారు.

కూటమి ఐక్యతను కాపాడుకుంటూ, ప్రజా సంక్షేమం మరియు నియోజకవర్గ అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని జనసేన నాయకులు తెలిపారు. కూటమి బలమే రాష్ట్ర అభివృద్ధికి మరింత బలాన్నిస్తుందని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో పుంగనూరు మండల జనసేన అధ్యక్షడు విరూపాక్షి, పట్టణ అధ్యక్షుడు నరేష్ రాయల్,జిల్లా పోగ్రామ్స్ కమిటీ కార్యదర్శి చైతన్య రాయల్, మండల సీనియర్ నాయకులు శివ కుమార్ రెడ్డి, పాముల హరి,మండల కార్యదర్శి బాలాజీ నాయక్, కుమార్,పట్టణ ఉపాధ్యక్షుడు నందు, GN బాబు,పండు రాయల్, శ్రీనివాసులు, వీర మహిళ అరుణ, సోమల మండల అధ్యక్షుడు భూషణ్ రాయల్, సోమల AMC డైరెక్టర్ మురళీ రాయల్, జాకీర్, సోము, చౌడేపల్లి మండల నాయకులు మురళి, జావేద్, కాలేశా, తదితరులు పాల్గొన్నారు.,

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR