Punganur: కోనేరు శుద్ధి పనులను పరిశీలించిన జనసేన నేత రాయల్ కుమార్

Punganur: పుంగనూరు మండలం నెక్కుందిలో ఆగిస్తిశ్వర స్వామి ఆలయ కోనేరు శుద్ధి పనులను జనసేన నేత రాయల్ కుమార్ పరిశీలించి, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు.

MAHESH, PUNGANOOR
Published on: 7 Oct 2026 6:36 PM IST
Punganur
X

Punganur: కోనేరు శుద్ధి పనులను పరిశీలించిన జనసేన నేత రాయల్ కుమార్

పుంగనూరు: పుంగనూరు మండలం నెక్కుంది పంచాయితి ప్రసిద్ధ శ్రీ ఆగిస్తిశ్వర స్వామి ఆలయం కోనేరు శుభ్రతకు జనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్. కోనేరును సందర్శించి కోనేరు శుద్ధికి సంబంధించి ఎపిఓ శివ శంకర్ తో చర్చించి వీబిజి రామ్ జీ గ్రామీణ అభివృద్ధి స్కీమ్ ద్వార సుమారు లక్ష రూపాయలతో కోనేరు శుద్ధి పనులు త్వరలో ప్రారంభించ నున్నట్లు తెలిపారు.

ఈ సందర్బంగా ఆలయ అర్చకులు రాయల్ కుమార్ కి ఆలయ మౌలిక వసతులలో భాగంగా నీటి వసతి, శౌచలయం తదితర వసతులు కల్పించాలని కోరడం జరిగింది. దీనికి గాను నియోజకవర్గం ఇంచార్జి మధు సుదన్ నాయుడు వారి ద్రుష్టి కి తీసుకు వెళ్లి త్వరిత గతిన సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు.

సమస్య ను వెంటనే పరిష్కారం కోసం ముందుకు వచ్చిన నియోజకవర్గం ఇంచార్జి మధుసూదన్ నాయుడు కి కృతజ్ఞతలు తెలియజేసారు. ఈ కార్యక్రమం లోజనసేన సీనియర్ నాయకులు రాయల్ కుమార్,వేణు రాయల్, నానాబాల ఉదయ్ ,వెంకట్ స్వామి టిడిపి సీనియర్ నాయకులు

‎తిమ్మాలయ్య, మనోజ్, పురుషోత్తం పెద్ద అలాసాపురం, శ్రీనాథ్, నాగభూషణం, మహేష్, ప్రశాంత్, మునిరామయ్య, ఆది, మనోహర, రవి, మణి, సోమశేఖర్, మునిస్వార, కిషోర్, ప్రభాకర్,మునెప్ప,మంజునాథ్ స్వామి, సోమ్ శేఖర్ లు పాల్గొన్నారు. గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

రాయల్ కుమార్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR