Punganur: శ్రీ చాముండేశ్వరి దేవి రూపంలో చదళ్ల చౌడేశ్వరి
Punganur: పుంగనూరు పరిధి చదళ్ల చౌడేశ్వరి ఆలయంలో దసరా ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు చాముండేశ్వరిగా దర్శనమివ్వగా, జబర్దస్త్ టీమ్ కామెడీ షో విశేషంగా అలరించింది.
Punganur: శ్రీ చాముండేశ్వరి దేవి రూపంలో చదళ్ల చౌడేశ్వరి
పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గంలోనే అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్న చదళ్ల శ్రీ సప్తమాతృత సమేత శ్రీ చౌడేశ్వరి దేవి దసరా ఉత్సవాలు ప్రస్తుతం టాక్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ గా మారింది. గురువారం అమ్మవారు ప్రముఖ శక్తి దేవత శ్రీ చాముండేశ్వరిగా దర్శనమిచ్చారు.
దుష్టశక్తులను దునుమాడే దేవతగా చేత త్రిశూలం ధరించి దుష్ట సంహారం గావించే అమ్మవారి రూపం దర్శించి ప్రజలు భక్తులు మహిళలు తరించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారికి శ్రీ చాముండి స్తోత్రం పారాయణం నిర్వహించారు. భక్తులకు ఎన్విఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్న ప్రసాద వితరణ చేపట్టారు.




