Chittoor: చిత్తూరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ - మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు!
Chittoor: చిత్తూరు పోలీస్ శిక్షణా కేంద్రంలో 142 మంది SCTPCల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Chittoor: చిత్తూరులో పోలీసుల పాసింగ్ అవుట్ పరేడ్ - మంత్రి మండిపల్లి కీలక వ్యాఖ్యలు!
Chittoor: చిత్తూరు జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో తొమ్మిది నెలల ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకున్న 142 మంది SCTPCల పాసింగ్ అవుట్ పరేడ్ కార్యక్రమానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై శిక్షణ పూర్తి చేసుకున్న పోలీసు శిక్షణార్థులకు అభినందనలు తెలిపారు.
ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణే పోలీసుల ప్రధాన బాధ్యత అని మంత్రి మండిపల్లి పేర్కొన్నారు. కొత్తగా విధుల్లోకి అడుగుపెడుతున్న ప్రతి పోలీసు అంకితభావంతో పనిచేస్తూ, యూనిఫాం గౌరవాన్ని కాపాడాలని సూచించారు. ప్రజలతో మర్యాదగా వ్యవహరిస్తూ వారి విశ్వాసాన్ని పొందేలా విధులు నిర్వహించాలని అన్నారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పోలీసు శాఖను మరింత బలోపేతం చేయడం, సిబ్బందికి మెరుగైన శిక్షణతో పాటు సంక్షేమం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని మంత్రి తెలిపారు. పోలీసు కానిస్టేబుల్ శిక్షణార్థుల స్టైపెండ్‌ను రూ.4,500 నుంచి రూ.12,000కు పెంచినట్లు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా 5,757 మంది SCTPCలు శిక్షణ పూర్తి చేసి ప్రజాసేవలోకి అడుగుపెడుతున్నారని, మరోవైపు వివిధ పోలీసు అనుబంధ విభాగాల్లో 2,050 పోస్టులతో పాటు 147 ఫైర్ సర్వీసెస్ డ్రైవర్ ఆపరేటర్ పోస్టుల నియామక ప్రక్రియ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. యువతకు మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా ఎమ్మెల్యే గురుజాల జగన్ మోహన్ గారు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ శ్రీ సుమిత్ కుమార్, ఐ.ఏ.ఎస్., జిల్లా పోలీసు అధికారి శ్రీ తుషార్ డూడి, ఐ.పి.ఎస్., జిల్లా పోలీసు శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్, అదనపు పోలీసు అధికారి శ్రీ ఎస్. మహబూబ్ బాషా చిత్తూరు మాజీ మేయర్ కటారి అనురాధ గారు తదితరులు పాల్గొన్నారు.




