Madanapalle: డీఈఓ లాగిన్ డేటా మార్పులపై దర్యాప్తు జరపాలి: APSJAC

Madanapalle: అన్నమయ్య జిల్లా డీఈఓ లాగిన్‌లో డేటా మార్పులు, రూ.1.40 కోట్ల గుడ్లు, చిక్కీల బిల్లుల అవకతవకలపై విచారణ జరపాలని APSJAC, USFI డిమాండ్ చేశాయి.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 22 Sept 2026 7:02 PM IST
Madanapalle
X

Madanapalle: డీఈఓ లాగిన్ డేటా మార్పులపై దర్యాప్తు జరపాలి: APSJAC

అన్నమయ్య జిల్లా: మదనపల్లి, అన్నమయ్య జిల్లా నేడు పాఠశాల రీజనల్ జాయింట్ డైరెక్టర్ గారు నియమించిన కమిటీ సభ్యులకు వినతీపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు వి. ఉత్తన్న, USFI రాష్ట్ర ఉపాధ్యక్షులు సర్వేపల్లి నరసింహ మాట్లాడుతూ జిల్లా అధికారి మీద విచారణ చేయు సందర్భంలో ఆ పై స్థాయి అధికారులచే విచారణ జరిపించాలని తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే అధికారులను తక్షణమే సస్పెండ్ చేసి విచారణ చేయాలని అన్నారు. రికార్డులను కూడా తారు మారు చేస్తారానే అనుమానం ఉంది అన్నారు.

2025 జూన్ నుంచి డిసెంబర్ వరకు నమోదైన వివరాల్లో విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన వ్యత్యాసం, సుమారు రూ.1.40 కోట్ల నిధుల దుర్వినియోగం పై అనుమానాలు ఉన్నట్లు వార్తల్లో వచ్చిన అంశాలను ప్రభుత్వం రాష్ట్ర స్థాయి కమిటీ వేసి విచారణ చేపట్టాలని అన్నారు. ఈ అంశాలపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని, విచారణ పూర్తయ్యే వరకు డీఈఓ సుబ్రహ్మణ్యంను ఒక్కన పెట్టాలి అన్నారు.

అలాగే కాంట్రాక్టర్‌కు సంబంధించిన లైసెన్స్‌ను పరిశీలించి, తప్పిదాలు లేదా అవకతవకలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం లైసెన్స్ రద్దు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ విషయంపై జిల్లా స్థాయిలో తగిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ గారికి ఫిర్యాదు చేసి, సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వాలి అని కోరతామన్నారు.

ఈ కార్యక్రమంలో APSJAC నాయకులు గంగరాజు, USFI జిల్లా కార్యదర్శి కమలాకర్ నాయుడు , జిల్లా ఉపాధ్యక్షులు గణేష్ రాయల్ పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI