Rayachoti: పదవులు ముగిసినా ప్రజాసేవ ఆగదు: గడికోట శ్రీకాంత్ రెడ్డి

Rayachoti: పదవులు వస్తుంటాయి పోతుంటాయి కానీ ప్రజలకు చేసిన సేవలే శాశ్వతంగా నిలుస్తాయని గాలివీడు మాజీ ప్రజాప్రతినిధుల సన్మానంలో గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Updated on: 4 Oct 2026 8:08 PM IST
Rayachoti
X

Rayachoti: పదవులు ముగిసినా ప్రజాసేవ ఆగదు: గడికోట శ్రీకాంత్ రెడ్డి

Rayachoti: ప్రజల కోసం అంకితభావం తో పనిచేసిన ప్రజాప్రతినిధుల సేవలను ఎప్పటికీ మరువలేమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఇటీవల పదవీకాలం పూర్తయిన గాలివీడు మండల తాజా మాజీ ఎంపీపీ జల్లా పద్మావతమ్మ, మాజీ జెడ్పీటీసీ ఎస్ కె ఖాదర్ మోహిద్దీన్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లను ఆయన ఘనంగా సత్కరించారు. దుశ్శాలువాలతో సన్మానించి వారి సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ..ప్రజాప్రతినిధులకు పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి కానీ ప్రజల కోసం చేసిన సేవలు మాత్రం చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. పదవీకాలంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసిన మాజీ ప్రజాప్రతినిధుల సేవాభావం అభినందనీయమన్నారు.

గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు ప్రజలతో మమేకమై పనిచేసిన మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్సార్‌సీపీ బలోపేతానికి కూడా విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. అధికారం ఉన్నప్పుడు మాత్రమే కాదు.. పదవులు లేని సమయంలోనూ ప్రజల మధ్య ఉంటూ వారి కష్టసుఖాల్లో భాగస్వాములు కావడమే నిజమైన ప్రజాసేవకు నిదర్శనమని అన్నారు. ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తమ పదవీకాలంలో అందించిన సేవలను శ్రీకాంత్‌రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజల ఆదరాభిమానాలను సంపాదించుకున్న నాయకులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

పదవులు పూర్తయినా ప్రజలతో బంధం కొనసాగించాలని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ వైఎస్సార్‌సీపీకి మరింత బలం చేకూర్చాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ప్రజాప్రతినిధులు శ్రీకాంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.వైఎస్ఆర్ సిపి స్టేట్ లీగల్ సెల్ కో ఆర్డినేటర్ జల్లా సుదర్శన్ రెడ్డి, మండల కన్వీనర్ మిట్టపల్లె యదుభూషన్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల నాగభూషన్ రెడ్డి, మాజీ ఎంపిపి బండి చిన్నరెడ్డి, మాజీ వైస్ ఎంపిపి రమేష్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి గుమ్మా అమరనాధ రెడ్డి, మాజీ సర్పంచ్ ఉమాపతిరెడ్డి, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI