Pileru: ఖాన్స్ వారి నిఖా వేడుకలో సుగవాసి ప్రసాద్ బాబు.. ఆశీర్వాదం

Pileru: పీలేరులోని నాగిరెడ్డి ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఖాన్స్ వారి నిఖా వేడుకలో రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 4 Oct 2026 3:08 PM IST
Pileru
X

Pileru: ఖాన్స్ వారి నిఖా వేడుకలో సుగవాసి ప్రసాద్ బాబు.. ఆశీర్వాదం

Pileru: పీలేరు పట్టణంలోని నాగిరెడ్డి మెగా ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన ఖాన్స్ వారి నిఖా వేడుకలో రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,సుగవాసి ప్రసాద్ బాబు గారు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వధూవరులను ఆత్మీయంగా ఆశీర్వదించి, వారి నూతన వైవాహిక జీవితానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

అల్లాహ్ ఆశీస్సులతో నూతన దంపతుల జీవితం ప్రేమానురాగాలు, సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో నిండాలని, వారి దాంపత్య జీవితం కలకాలం అన్యోన్యతతో కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

ఈ శుభకార్యాన్ని ఆనందోత్సాహాల మధ్య నిర్వహించిన కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI