Boyakonda: బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి
Boyakonda: బోయకొండ గంగమ్మ దసరా నవరాత్రి ఉత్సవాల్లో పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
Boyakonda: బోయకొండ గంగమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి
Boyakonda: ప్రముఖ శక్తి క్షేత్రం శ్రీ బోయకొండ గంగమ్మ అమ్మవారి సన్నిధిలో జరుగుతున్న దసరా నవరాత్రి ఉత్సవాలలో భాగంగా, పుంగనూరు శాసనసభ్యులు, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. సరస్వతి దేవి అలంకారంలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి చేరుకున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అర్చకులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్న ఆయనకు అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు ద్వారకానాథరెడ్డి సైతం బోయకొండ గంగమ్మను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.
దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకారాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. భక్తుల రాకతో బోయకొండ ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో చౌడేపల్లి మండలానికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




