Chittoor: కార్వేటినగరంలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు!
Chittoor: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటినగరంలో మాజీ ఎంపీపీ లతా బాలాజీ ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.
Chittoor: కార్వేటినగరంలో ఘనంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు!
Chittoor: చిత్తూరుజిల్లా, గంగాధర నెల్లూరు నియోజకవర్గం, కార్వేటినగరంలో ఈ రోజు మాజీ ఎంపీపీ లతా బాలాజీ వారి ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వైసిపి నాయకులు కార్యకర్తలు తీసిని పంచుకుని పెద్ద రెడ్డి రామచంద్రారెడ్డి వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్టీ అధ్యక్షులు శేఖర్ రాజు, మాజీ సర్పంచ్ ధనంజయ వర్మ, శేషాద్రి, గోపి, మండల బూత్ కన్వీనర్ పట్నం ప్రభాకర్ రెడ్డి,హమీద్, ఏకాంబరం, పయని రెడ్డి, రత్నారెడ్డి, శివ మొదలియార్, మురళి, మదన్ కుమార్ రెడ్డి, నాగేంద్ర, ఆర్ముగం, మున్నా, షబ్బీర్, సాయి రాయల్, ఋషీంద్ర,గౌతమ్ ధనశేఖర్రాజు, లోకనాథం తదితర వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




