Madanapalle: కురువంక సర్పంచ్ అభ్యర్థిగా పసుపులేటి పార్వతమ్మ నామినేషన్
Madanapalle: మదనపల్లె మండలం కురువంక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి సతీమణి పసుపులేటి పార్వతమ్మ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు.
Madanapalle: కురువంక సర్పంచ్ అభ్యర్థిగా పసుపులేటి పార్వతమ్మ నామినేషన్
మదనపల్లె: కురువంక గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి సతీమణి పసుపులేటి పార్వతమ్మ నామినేషన్ దాఖలు చేశారు. మదనపల్లె మండలంలోని వైఎస్సార్ కాలనీ కోళ్లబైలు-2 సచివాలయంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ పసుపులేటి చలపతి మాట్లాడుతూ... గ్రామ ప్రజల ఆశీస్సులు, ఆదరణతో తమ కుటుంబం ఎల్లప్పుడూ ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉంటుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజలు తమకు మద్దతుగా నిలిచి పార్వతమ్మను ఆశీర్వదించాలని కోరారు.




