Palamaner: పలమనేరులో ఘనంగా ఐశ్వర్య మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ!
Palamaner: పలమనేరు బోరెడ్డిపల్లి గాయత్రీ దేవి ఆలయంలో ఘనంగా ఐశ్వర్య మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ. ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే అమరనాథరెడ్డి.
Palamaner: పలమనేరులో ఘనంగా ఐశ్వర్య మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ!
Palamaner: పలమనేరు మున్సిపల్ పరిధిలోని బోరెడ్డిపల్లి కాలనీలో కొలువై ఉన్న గాయత్రీ దేవి ఆలయంలో ఐశ్వర్య మహాలక్ష్మి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, అమ్మవారి ప్రతిష్ఠ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని భక్తితో ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమరనాథరెడ్డి మాట్లాడుతూ, ఐశ్వర్య మహాలక్ష్మి అమ్మవారి కృపాకటాక్షాలతో పలమనేరు పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పట్టణంలో చేపట్టే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని, భవిష్యత్తులోనూ అమ్మవారి చల్లని చూపులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంతో పాటు సమాజంలో ఐక్యత, సౌభ్రాతృత్వాన్ని బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.




