Madanapalle: మృత్యు ఉచ్చులుగా మారిన డ్రైనేజీ మ్యాన్‌హోల్స్!

Madanapalle: మదనపల్లె నెహ్రూ వీధి మలుపు వద్ద ప్రమాదకరంగా మారిన డ్రైనేజీ మ్యాన్‌హోల్స్. భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు.

Srinivasulu, Madanapalle
Published on: 10 Oct 2026 10:22 AM IST
Madanapalle
X

Madanapalle: మృత్యు ఉచ్చులుగా మారిన డ్రైనేజీ మ్యాన్‌హోల్స్!

మదనపల్లె: మదనపల్లె నెహ్రూ వీధి మలుపు వద్ద డ్రైనేజీ కోసం మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన మ్యాన్‌హోల్స్‌ ప్రజలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. సరైన భద్రతా చర్యలు లేకపోవడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని, ఇప్పటికే పలువురు గాయపడ్డారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ మార్గం గుండా నిత్యం వేలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామి ఆలయం, కన్యకా పరమేశ్వరి ఆలయం, శివాలయాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి రద్దీగా ఉండే ప్రాంతంలో మ్యాన్‌హోల్స్‌ ప్రమాదాలకు కారణమవుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

మ్యాన్‌హోల్స్‌కు పటిష్టమైన మూతలు ఏర్పాటు చేసి, ప్రమాదాలు జరగకుండా శాశ్వత పరిష్కారం చూపాలని మున్సిపల్ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle