dhone: నాలుగు మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
dhone: నంద్యాల, డోన్, బేతంచెర్ల, నందికొట్కూర్ మున్సిపాలిటీల ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన నంద్యాల ఎస్పీ సునీల్ శరన్. పటిష్ట భద్రతా ఏర్పాట్లు.
dhone: నాలుగు మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ
డోన: రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ జిల్లాలోని నంద్యాల, డోన్, బేతంచర్ల, నందికొట్కూర్ నాలుగు మున్సిపాలిటీల కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించి పోలీసు అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజున ఏఆర్, ఆర్ఆర్ ఫోర్స్, సివిల్ పోలీసు సిబ్బందితో పాటు సీఐలు, డీఎస్పీలను విధుల్లో నియమించినట్లు వెల్లడించారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించి ప్రశాంత వాతావరణాన్ని కాపాడాలని జిల్లా ఎస్పీ కోరారు.




