Nagari: తడుకుపేటలో క్వారీల అక్రమ తవ్వకాలపై స్థానికుల ఆందోళన
Nagari: నగరి మండలం తడుకుపేట పంచాయతీలో నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న క్వారీల తవ్వకాలు, భారీ పేలుళ్లపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Nagari: తడుకుపేటలో క్వారీల అక్రమ తవ్వకాలపై స్థానికుల ఆందోళన
నగరి నియోజకవర్గం, తడుకు పేట: నగరి మండలంలోని తడుకుపేట పంచాయతీ పరిధిలోని పలు క్యారీల్లో జరుగుతున్న తవ్వకాలు, భారీ పేలుళ్లపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో మంజూరైన అనుమతులను ఆధారంగా చేసుకుని పరిమితులకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
క్యారీల్లో భారీ పేలుళ్లు నిర్వహించడంతో రాళ్లు, మట్టి ఎగిరిపడే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. నివాస ప్రాంతాలకు సమీపంలో పేలుళ్లు నిర్వహించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
క్యారీలకు ఉన్న అనుమతులు, లీజు పరిధి, తవ్వకాల పరిమాణం, పేలుళ్లకు సంబంధించిన అనుమతులు, ప్రభుత్వానికి చెల్లిస్తున్న రాయల్టీ తదితర అంశాలపై అధికారులు తనిఖీలు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
క్యారీల వ్యవహారంపై స్థానిక ఎమ్మెల్యే కూడా మైనింగ్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు, పేలుళ్లు జరుగుతున్నట్లు తేలితే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
తడుకుపేట పంచాయతీలోని అన్ని క్యారీలపై సమగ్ర తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.




