Nagari: నగరి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ!
Nagari: నగరి పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లను ఏఎస్పీ ఎస్.షాను పరిశీలించి, ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు భద్రత పటిష్టం చేయాలని సూచించారు.
Nagari: నగరి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన అడిషనల్ ఎస్పీ!
Nagari: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో నగరి సబ్ డివిజన్ పరిధిలోని పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ హాళ్లను అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఎస్.షాను బుధవారం పరిశీలించారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీ కెమెరాల పనితీరు, పోలీసు సిబ్బంది విధుల నిర్వహణ, నిరంతర పర్యవేక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు.
ఎన్నికల నియమావళిని కచ్చితంగా అమలు చేస్తూ, పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్లు, కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని ఆదేశించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ తనిఖీల్లో నగరి సబ్ డివిజన్ డీఎస్పీ చంద్రశేఖర్ పాల్గొన్నారు.




