Nagari: నగరి మున్సిపాలిటీలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్!

Nagari: చిత్తూరు జిల్లా నగరి మున్సిపాలిటీలో ఉదయం 7 గంటలకు ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనున్న ఓటింగ్, అధికారుల పటిష్ట భద్రత.

JALEEL, NAGARI & RENIGUNTA
Published on: 1 Nov 2026 9:59 AM IST
Nagari
X

Nagari: నగరి మున్సిపాలిటీలో ప్రశాంతంగా ప్రారంభమైన పోలింగ్!

Nagari: నగరి మున్సిపాలిటీలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఆదివారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.

ప్రజలందరూ ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని నగరి మున్సిపల్ ఎన్నికల అధికారి కోరారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరూ పాల్పడరాదని సూచించారు. పోలింగ్‌ను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రజలు, ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లా యంత్రాంగానికి పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

JALEEL, NAGARI & RENIGUNTA

JALEEL, NAGARI & RENIGUNTA