Nimmanapalle: నిమ్మనపల్లె మోడల్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థినికి కరెంట్ షాక్!
Nimmanapalle: అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మోడల్ స్కూల్‌లో విద్యార్థినికి కరెంట్ షాక్. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయుల నిర్లక్ష్యమే కారణమంటూ తల్లిదండ్రుల ఆరోపణ.
Nimmanapalle: నిమ్మనపల్లె మోడల్ స్కూల్‌లో పదో తరగతి విద్యార్థినికి కరెంట్ షాక్!
Nimmanapalle: అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం రెడ్డివారిపల్లె మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్న రజిత (16) శనివారం కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడింది. కిటికీ పక్కన ఉన్న విద్యుత్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగినట్లు విద్యార్థిని తండ్రి రవికుమార్ తెలిపారు. తన కుమార్తె కేకలు వేస్తున్నప్పటికీ ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు వెంటనే ఆసుపత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని రవికుమార్ ఆరోపించారు. తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వెంటనే పాఠశాలకు చేరుకుని రజితను మదనపల్లెలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. విద్యార్థిని పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.




