Chittoor: చిత్తూరు అభివృద్ధికి సైకిల్‌కు ఓటేయండి: గురజాల!
Chittoor: చిత్తూరు అభివృద్ధికి మున్సిపల్ పోరులో టీడీపీని గెలిపించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కటారి హేమలత కోరారు. ఆఖరి రోజు వారు విస్తృతంగా ప్రచారంచేశారు.
Chittoor: చిత్తూరు అభివృద్ధికి సైకిల్‌కు ఓటేయండి: గురజాల!
Chittoor: నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలంటే నగరపాలక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అభ్యర్థి కటారి హేమలత ప్రజలను కోరారు.ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం చిత్తూరు నగరంలోని కాజూరు నుంచి 26, 27, 30వ వార్డులతో పాటు పలు ప్రాంతాల్లో వారు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా కాజూరు జంక్షన్ వద్ద టీడీపీ సీనియర్ నాయకులు కాజూరు బాలాజీ, కాజూరు రాజేష్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, మేయర్ అభ్యర్థి కటారి హేమలత, ఎంపీ దర్గమల్ల ప్రసాదరావులకు గజమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మేయర్ అభ్యర్థి కటారి హేమలత మాట్లాడుతూ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నాయకత్వంలో గత రెండేళ్లుగా చిత్తూరు నగరం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందన్నారు.నగరపాలక సంస్థ మేయర్‌గా తనను గెలిపిస్తే నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను అత్యధి




