Punganur: పుంగనూరులో మంత్రుల మీడియా సమావేశం

Punganur: పుంగనూరు టీడీపీ కార్యాలయంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి 32 మంది ఏకగ్రీవ కౌన్సిలర్లకు పత్రాలు అందించారు.

MAHESH, PUNGANOOR
Published on: 29 Oct 2026 9:33 PM IST
Punganur
X

Punganur: పుంగనూరులో మంత్రుల మీడియా సమావేశం

పుంగనూరు: పుంగనూరు టిడిపి పార్టీ కార్యాలయంలో బిసి.జనార్దన్ రెడ్డి, రామ్ ప్రసాద్ రెడ్డి మంత్రుల మీడియా సమావేశం. పుంగనూరు చరిత్రను తిరగరాసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రులు. ఏకగ్రీవంగా ఎన్నికైన మున్సిపాలిటీ 32 వార్డు కూటమి కౌన్సిలర్లకు నియామక పత్రాలు అందించిన మంత్రులు. కర్మ ఎవరిని వదలదు అన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి. పుంగనూరు స్థానిక మున్సిపల్ ఎన్నికలకు టిడిపి జనసేన బిజెపి పార్టీ లు 80% గెలవడం జరిగింది.

ఇదే గడ్డపైన గత ఐదు సంవత్సరాల మునుపు అరాచక పాలన దుష్టశక్తులు ఏకమై తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పై దాడి చేసి అక్రమ కేసులు బనాయించి వందలు మంది ని జైలు కు పంపారు. ఒకసారి కర్మ సిద్ధాంతాన్ని నమ్మినట్లయితే ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అనేది రుజువైందని చెప్పాలి. గత రెండున్నర సంవత్సరాల కూటమి పరిపాలన లో పుంగనూరు అభివృద్ధిని అడ్డుకున్నారు.

రాబోయే రోజుల్లో పుంగనూరు కి త్రాగునీరు సాగునీరు తో పాటు మౌలిక వసతుల అభివృద్ధి కి కట్టుబడి ఉన్నాం. గతంలో నేనే రాజు నాదే పాలన అనే విధానాన్ని పుంగనూరు ప్రజలు చైతన్యవంతులై రాక్షస పాలనను అంతమందించారు. జరగనున్న ఎంపీటీసీ జడ్పిటిసి స్థానాల్లో కూడా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుంది. గత ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డ కార్యకర్తలకు అండగా ఉంటాం.

పుంగనూరు అభివృద్ధి చేస్తే ప్రజలే రానున్న 2029 లోను కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపిస్తారు.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందు నేను మడత పెడతాను అంగీ మడత పెడతాను అని అన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీకు ప్రజలు ముందుగానే మడత పెట్టేశారు.

ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు మైకు పట్టుకుని మాట్లాడే మాటలు కాదని. మీకు అన్ని అభివృద్ధి చేస్తాం మాకు ఓట్లు వేసి గెలిపించండి అని అడగాల్సింది పోయి షర్టు మడత పెడతాం అంగీ మడత పెడతామని మైకు పట్టుకొని వ్యాఖ్యానించడం సరికాదన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి.

MAHESH, PUNGANOOR

MAHESH, PUNGANOOR