Chittoor: కాణిపాకం వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పణ!
Chittoor: చిత్తూరు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాణిపాకం వినాయక స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.
Chittoor: కాణిపాకం వినాయక స్వామికి పట్టు వస్త్రాలు సమర్పణ!
Chittoor: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారిని చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు.
స్వామి వారి దర్శనానికి విచ్చేసిన మంత్రివర్యులు తొలుత దేవస్థానం అతిధి గృహమునకు చేరుకొని పోలీసులచే గౌరవ వందనం స్వీకరించగా పూతలపట్టు శాసన సభ్యులు మురళీమోహన్ కాణిపాకం ఆలయ పాలక మండలి సభ్యులు స్వాగతం పలికారు.
అనంతరం అతిథి గృహం నుండి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు మంత్రివర్యులతోపాటుగా చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ళ ప్రసాదరావు, పూతలపట్టు చిత్తూరు శాసనసభ్యులు మురళీమోహన్ గురజాల జగన్మోహన్ లతో కలిసి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు మంత్రివర్యులు.
దర్శనానంతరం వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం ఈవో పెంచల కిషోర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.




