Chittoor: జడ్పీ అధ్యక్షురాలు శైలజకు అభినందనలు తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

Chittoor: చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శైలజ తేజోమూర్తిని ఆదివారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యే మురళీమోహన్ కలిసి సత్కరించారు.

VASU, PUTTALAPATTU
Published on: 22 Nov 2026 2:33 PM IST
Chittoor
X

Chittoor: జడ్పీ అధ్యక్షురాలు శైలజకు అభినందనలు తెలిపిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి!

చిత్తూరు జిల్లా: చిత్తూరు జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శైలజ తేజ మూర్తిని కలిసిన రాష్ట్ర రవాణా శాఖ క్రీడల శాఖ ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ ఆదివారం చైర్పర్సన్ స్వగృహము నందు మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఆయనతోపాటు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళీమోహన్.

ఈ సందర్భంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మురళీమోహన్ ను శైలజ మూర్తి దంపతులు పుష్ప గుచ్చాలను ఇచ్చి ఆహ్వానించారు. అనంతరం మంత్రి ,ఎమ్మెల్యే శైలజ మూర్తి దంపతులను సత్కరించారు.

చిత్తూరు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా ను ఆదర్శవంతముగా తీర్చిదిద్దాలని జిల్లా పరిషత్ అధ్యక్షురాలు శైలజ మూర్తికి సూచించారు.

ఈ కార్యక్రమంలో పూతలపట్టు మండల ఎంపీపీ గంగారపు గోపిరాష్ట్ర సీనియర్ నాయకులు యువరాజు నాయుడు, పూతలపట్టు పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గుంటూరు మురళి. బంగారుపాలెం మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ నాయుడు కాణిపాక బోర్డు సభ్యులు నాగరాజు నాయుడు, పూతలపట్టు మండల బిజెపి కన్వీనర్ ప్రసాదు, సింగల్ విండో అధ్యక్షులు జగన్నాథం, చిత్తూరు కాజురు బాలాజీ హరి ,మధు, నాదముని, సతీష్, రజిని, జిల్లా తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

VASU, PUTTALAPATTU

VASU, PUTTALAPATTU