Rayachoti: చిత్తూరు మేయర్ కటారి హేమలతకు మంత్రి మండిపల్లి అభినందనలు!
Rayachoti: చిత్తూరు నగర మేయర్‌గా ఎన్నికైన కటారి హేమలతను రాయచోటి పీసీఆర్ ఫంక్షన్ హాల్‌లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు.
Rayachoti: చిత్తూరు మేయర్ కటారి హేమలతకు మంత్రి మండిపల్లి అభినందనలు!
Rayachoti: ఇటీవల జరిగిన ఎన్నికల్లో చిత్తూరు కార్పొరేషన్ మేయర్‌గాఆ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు రాయచోటి పట్టణంలోని పీసీఆర్ ఫంక్షన్ హాల్‌లో మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన కటారి హేమలత గారికి శుభాకాంక్షలు తెలుపుతూ, చిత్తూరు నగర అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందాలని మంత్రి ఆకాంక్షించారు.
అనంతరం ఇరువురు నాయకులు ఆత్మీయంగా ముచ్చటించుకుంటూ ప్రజా సమస్యలు, అభివృద్ధి కార్యక్రమాలు, స్థానిక సంస్థల బలోపేతం తదితర అంశాలపై మాట్లాడుకున్నారు. ప్రజాసేవలో కొత్త బాధ్యతలు చేపట్టిన కటారి హేమలత గారికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.




