Chittoor: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి మండిపల్లి దిశానిర్దేశం!

Chittoor: రాయచోటిలో మున్సిపల్ ఎన్నికల విజయానికి కూటమి నేతలు సమష్టిగా కృషి చేయాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పిలుపునిచ్చారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 26 Sept 2026 3:48 PM IST
Chittoor
X

Chittoor: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి మండిపల్లి దిశానిర్దేశం!

Chittoor: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో కూటమి నేతలతో రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశమయ్యారు. ఎన్నికల్లో కూటమి నేతలు, కార్యకర్తలు సమన్వయంతో , ఐక్యంగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే జగన్మోహన్, గాలి భాను ప్రకాష్, కె.మురళీమోహన్, జనసేన ఎమ్మెల్యే బాలరాజు, స్థానిక సంస్థల తెదేపా ఇన్చార్జి, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, జిల్లా తెదేపా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి, జోనల్ ఇంచార్జి దామచర్ల సత్య, , భాజాపా అధ్యక్షుడు జగదీశ్వర నాయుడు , మాజీ ఎమ్మెల్సీ బీఎన్ రాజసింహులు, ప్రధాన కార్యదర్శి సునీల్ చౌదరి, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI