Chandragiri: మోహన్ బాబు వర్సిటీలో VLSI టెక్ వర్క్‌షాప్ విజయవంతం!
Chandragiri: మోహన్ బాబు వర్సిటీలో VLSI SoC డిజైన్ ఆన్‌లైన్ బూట్‌క్యాంప్ విజయవంతం. ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు సిలికాన్ సైన్ఆఫ్ వరకు సాంకేతిక శిక్షణ.
Chandragiri: మోహన్ బాబు వర్సిటీలో VLSI టెక్ వర్క్‌షాప్ విజయవంతం!
Chandragiri: చంద్రగిరి మండలం రంగంపేట సమీపంలోని మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో సోమవారం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో వి.ఎల్.ఎస్.ఐ సోసి డిజైన్ బూట్‌క్యాంప్ అనే అంశంపై ఆన్‌లైన్ వర్క్‌షాప్‌ను నిర్వహించారు. సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 05, 2026 వరకు జరిగిన ఈ వర్క్‌షాప్ ముఖ్యంగా మూడవ సంవత్సరం విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఉపయోగపడింది.
వి.ఎల్.ఎస్.ఐ, సిస్టమ్ ఆన్ చిప్ డిజైన్ రంగానికి సంబంధించిన ప్రాథమిక విషయాల నుండి ప్రాక్టికల్ డిజైన్ ఫ్లో వరకు విద్యార్థులకు క్షుణ్ణంగా అర్థమయ్యేలా శిక్షణ ఇచ్చారు. ఆర్.టి.ఎల్ డిజైన్ నుండి సిలికాన్ సైన్ఆఫ్ వరకు ప్రతి దశపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల సాంకేతిక నైపుణ్యాలను, పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన జ్ఞానాన్ని పెంపొందించడం ఈ వర్క్‌షాప్ ప్రధాన ఉద్దేశం.
ఈ వర్క్‌షాప్‌కు తిరుపతి నియలిట్ కి చెందిన సైంటిస్ట్ అర్చనా యాదవ్ వక్తగా వ్యవహరించి విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈసిఇ విభాగాధిపతి డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి పర్యవేక్షణలో, డాక్టర్ ఎమ్. ధరణి కన్వీనర్‌గా వ్యవహరించగా, విశ్వవిద్యాలయ ఐ.టి.పి.ఎల్, ఐ.ఇ.ఇ.ఇ విద్యార్థి సంఘాల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.




