Chinnamandem: చిన్నమండెం ఎంపీపీ అభ్యర్థిగా మండిపల్లి సుశీలమ్మ
Chinnamandem: చిన్నమండెం ఎంపీపీ అభ్యర్థిగా పార్టీ ఖరారు చేయడంతో పడమటికోన ఎంపీటీసీ స్థానానికి టీడీపీ తరఫున మండిపల్లి సుశీలమ్మ నామినేషన్ దాఖలు చేశారు.
Chinnamandem: చిన్నమండెం ఎంపీపీ అభ్యర్థిగా మండిపల్లి సుశీలమ్మ
అన్నమయ్య జిల్లా: రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలంలోని పదమంటికోన గ్రామానికి చెందిన మండిపల్లి సుశీలమ్మ గారు మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పార్టీ ఖరారు చేయడంతో పడమటికొన MPTCఅభ్యర్థిగా తన నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
ప్రజాసేవ పట్ల అంకితభావంతో, మండల అభివృద్ధి మరియు ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న మండిపల్లి సుశీలమ్మ గారు ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడం ఈ కార్యక్రమంలో ప్రధానాంశంగా నిలిచింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, ప్రజల అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వడం వంటి అంశాలను లక్ష్యంగా చేసుకుని ఆమె ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఈ నామినేషన్ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లి రాహుల్ కుమార్ రెడ్డి మరియు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపల్లె అభిమానులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో భాగస్వాములై, ఆమెకు తమ మద్దతును తెలియజేశారు.




