Mandapalli: మందపల్లి మందేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ యాగం!

Mandapalli: మందేశ్వర స్వామి ఆలయంలో వర్షాలు కురవాలని కోరుతూ నిర్వహించిన వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే బండారు సత్యానందరావు.

TRIMURTULU, KOTHAPETA
Updated on: 6 Oct 2026 1:17 PM IST
Mandapalli
X

Mandapalli: మందపల్లి మందేశ్వర స్వామి వారి ఆలయంలో ఘనంగా వరుణ యాగం!

Mandapalli: మందపల్లి గ్రామంలో నవగ్రహాల్లో అత్యంత శక్తివంతమైన శనైశ్చరస్వామి ప్రతిష్టించిన పవిత్రమైన మందేశ్వర స్వామి వారి సన్నిధిలో వరుణ యాగం, సహస్ర ఘటాభిషేకం నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. మంగళవారం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వరుణయాగంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావంతో దేశమంతా తీవ్రమైన కరువు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో అష్టదిక్పాలకుల్లో పశ్చిమ దిక్కుకు అధిపతి అయిన వరుణుడి కరుణ కోరుతూ, వర్షాలు కురవాలని కోరుకుంటూ, పదివేల సార్లు వేద శ్లోకాలు పఠించడం, సహస్ర ఘటాభిషేకం నిర్వహించడం జరిగిందన్నారు.

పూర్వకాలంలో వానలు కురవని దుర్భిక్ష పరిస్థితులు ఏర్పడినప్పుడు రాజులు, ఋషులు వరుణయాగం చేసేవారని, యాగ ఫలితంగా వర్షాలు కురిసేవని తెలిపారు. ఈ వరుణ యాగంతో మన ప్రాంతమంతా వర్షాలు చక్కగా కురవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ యాగంతో తప్పకుండా వరుణదేవుడు అనుగ్రహిస్తాడని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

TRIMURTULU, KOTHAPETA

TRIMURTULU, KOTHAPETA