Madanapalle: సామాజిక వర్గాల మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలోకి మహబూబ్ భాషా

Madanapalle: మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలో అన్ని సామాజిక వర్గాల మద్దతుతో టీడీపీ తరఫున సర్పంచ్ ఎన్నికల బరిలోకి మహబూబ్ భాషా సిద్ధమవుతున్నారు.

Srinivasulu, Madanapalle
Published on: 12 Nov 2026 3:09 PM IST
Madanapalle
X

Madanapalle: సామాజిక వర్గాల మద్దతుతో సర్పంచ్ ఎన్నికల బరిలోకి మహబూబ్ భాషా

అన్నమయ్య జిల్లా: మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలో టీడీపీ తరఫున సర్పంచ్ ఎన్నికల బరిలో పాల్గొనేందుకు మహబూబ్ భాషా సిద్ధమవుతున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వాల్మీకి, బలిజ తదితర సామాజిక వర్గాల మద్దతుతో పోటీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ సందర్భంగా మహబూబ్ భాషా మాట్లాడుతూ.. అన్ని సామాజిక వర్గాల ప్రజల సహకారం, ఆశీర్వాదంతో ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆదరాభిమానాలతో విజయం సాధించి గ్రామానికి సేవ చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle