Madanapalle: ఉద్రిక్తత వైకాపా జెడ్పీటీసీ నామినేషన్ పత్రాల చించివేత!
Madanapalle: మదనపల్లెలో వైకాపా జెడ్పీటీసీ అభ్యర్థి కిరణ్మయి నామినేషన్ పత్రాలను చించివేశారని, తనపై దౌర్జన్యం చేశారని ఆమె భర్త శేషాచలపతి ఆరోపించారు.
Madanapalle: ఉద్రిక్తత వైకాపా జెడ్పీటీసీ నామినేషన్ పత్రాల చించివేత!
Madanapalle: వైఎస్సార్‌సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి జన్నే కిరణ్మయిపై దాడి చేసి, ఆమె చీర లాగి అవమానించడంతో పాటు రెండు సెట్ల నామినేషన్ పత్రాలను చించివేశారని ఆమె భర్త జన్నే శేషాచలపతి నాయుడు ఆరోపించారు.
నామినేషన్ వేసేందుకు వెళ్తుండగా టీడీపీ కార్యకర్తలు అడ్డుకుని దౌర్జన్యానికి పాల్పడ్డారని తెలిపారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మహిళా అభ్యర్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించడాన్ని వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో ఓటమి భయంతోనే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఆరోపించాయి.
ఘటనకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. ఎన్నికల విధుల్లో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరాయి.




