Madanapalle: దేశ పరిణామాలపై యువత ఉద్యమించాలి

Madanapalle: మదనపల్లెలో ఏపీవైసీ రాష్ట్రవ్యాప్త యాత్ర సన్నాహక సమావేశంలో మాట్లాడిన ఏపీసీసీ నేత అల్లా బకాష్; నవంబర్ 28న పవన్ తేజ నాయుడు పర్యటన.

Srinivasulu, Madanapalle
Published on: 23 Nov 2026 7:58 PM IST
Madanapalle
X

Madanapalle: దేశ పరిణామాలపై యువత ఉద్యమించాలి

మదనపల్లె: దేశంలో జరుగుతున్న పరిణామాలపై యువత చైతన్యంతో ఉద్యమించాలని, కాంగ్రెస్ పార్టీలో యువతకు పెద్దపీట వేస్తున్నామని ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అల్లా బకాష్ పేర్కొన్నారు. సోమవారం దొంతివీధిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శరత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఏపీవైసీ రాష్ట్రవ్యాప్త యాత్ర సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా అల్లా బకాష్ మాట్లాడుతూ 2029లో రాహుల్ గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా యువజన కాంగ్రెస్ పనిచేయాలని పిలుపునిచ్చారు. యువత, డెలివరీ బాయ్స్, ర్యాపిడో రైడర్లు, ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారానికి ఏపీవైసీ చేస్తున్న పోరాటాలను అభినందించారు. ఈ నెల 28న రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పవన్ తేజ నాయుడు, రాష్ట్ర ఇన్‌చార్జి లెనిన్ ప్రసాద్ మదనపల్లెలో పర్యటించనున్నట్లు జిల్లా ఇన్‌చార్జిలు సుజన్ కుమార్, బీవీ గౌడ్ తెలిపారు.

నవంబర్ 24 నుంచి డిసెంబర్ 1 వరకు జరిగే రాష్ట్రవ్యాప్త యాత్రలో భాగంగా యువత సమస్యలపై ప్రత్యేకంగా చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ పీలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి షేక్ రెడ్డి సాహెబ్, బి. మహ్మద్ షరీఫ్, కె. మీనా కుమారి, రెడ్డి చైతన్య, బి. జీవన్ కుమార్, పఠాన్ ముబారక్, ఆర్. నాగరాజు, పి. హరినాథ్, ఎస్. గుల్షన్ తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle