Madanapalle: మదనపల్లె వివేకానంద పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఆదినారాయణ ఏకగ్రీవం
Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్ ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఆదినారాయణ, వైస్ చైర్మన్‌గా అమరావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Madanapalle: మదనపల్లె వివేకానంద పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఆదినారాయణ ఏకగ్రీవం
మదనపల్లె: మదనపల్లె నీరుగట్టువారిపల్లి వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో పాఠశాల నిర్వహణ కమిటీ (ఎస్‌ఎంసీ) ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
ఎస్‌ఎంసీ చైర్మన్‌గా ఆదినారాయణ, వైస్ చైర్మన్‌గా అమరావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్‌లను 42వ వార్డు ఇన్‌చార్జ్ మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో శాలువా కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మదనపల్లె నియోజకవర్గంలో అగ్రగామిగా నిలుస్తున్న నీరుగట్టువారిపల్లి వివేకానంద పాఠశాలను మరింత విజయపథంలో నడిపించాలని నూతన ఎస్‌ఎంసీ కమిటీకి సూచించారు.
విద్యార్థులు రాష్ట్రస్థాయిలో మరిన్ని ర్యాంకులు సాధించేలా పాఠశాలను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు ఎస్‌ఎంసీ కమిటీ వారధిగా నిలిచి పాఠశాల అభివృద్ధికి మరింత కృషి చేయాలని మధుసూదన్ రెడ్డి కోరారు.




