Madanapalle: వివేకానంద స్కూల్ కమిటీ ఎన్నిక.. ఏకగ్రీవంగా చైర్మన్ ఎంపిక

Madanapalle: మదనపల్లె వివేకానంద మున్సిపల్ హైస్కూల్ కమిటీ చైర్మన్‌గా నాన్నపు ఆదినారాయణ, వైస్ చైర్మన్‌గా కాల అమరావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Srinivasulu, Madanapalle
Published on: 29 Sept 2026 4:04 PM IST
Madanapalle
X

Madanapalle: వివేకానంద స్కూల్ కమిటీ ఎన్నిక.. ఏకగ్రీవంగా చైర్మన్ ఎంపిక

మదనపల్లె: వివేకానంద మున్సిపల్ హైస్కూల్‌లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా చైర్మన్ అభ్యర్థిగా నాన్నపు ఆదినారాయణ, వైస్ చైర్మన్‌గా కాల అమరావతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

42వ వార్డు ఇన్‌చార్జ్ మండిపల్లి జెసిబి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. వార్డులో ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle