Madanapalle: పార్వతీదేవి ఒడిలో గణనాథుడు ఘనంగా అన్నదానం, లడ్డూ వేలం

Madanapalle: మదనపల్లె కోళ్లబైలులో ప్రత్యేకంగా కొలువుదీరిన వినాయకుడు. 500 మందికి అన్నదానం, రూ. 23 వేలకు దక్కించుకున్న లడ్డూ. ఘనంగా వినాయక చవితి వేడుకలు.

Srinivasulu, Madanapalle
Published on: 25 Sept 2026 11:42 PM IST
Madanapalle
X

Madanapalle: పార్వతీదేవి ఒడిలో గణనాథుడు ఘనంగా అన్నదానం, లడ్డూ వేలం

మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె కోళ్లబైలు వన్ జగన్ కాలనీ లో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఎగవఇంటి లోహిత, సాయికుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో పార్వతీదేవి ఒడిలో కొలువుదీరిన వినాయకుడి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

కోళ్లబైలు 1, 2 ఇంచార్జ్ రాటకొండ శ్రీనివాసులు నాయుడు ఆధ్వర్యంలో శుక్రవారం 500 మందికి అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు నాయుడు భార్య రెడ్డమ్మను శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరం నిర్వహించిన లడ్డూ వేలంలో విష్ణువర్ధన్ రూ.23 వేలతో లడ్డూను దక్కించుకున్నారు.

ఈ సందర్భంగా లోహిత సాయి మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో గణనాథుడిని పూజించి సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కాలనీలో ప్రజలందరూ ఐకమత్యంతో వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. అన్నదాన కార్యక్రమానికి సహకరించిన దాతలు, నిర్వాహకులు, కాలనీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ ప్రజలు, భక్తులు, నిర్వాహకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle