Madanapalle: మదనపల్లెలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య.. పట్టింపు లేని వైనం!

Madanapalle: మదనపల్లె పట్టణంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య. అక్రమ పార్కింగ్, ప్రైవేట్ బస్సుల నిలుపుదలపై ప్రజల ఆగ్రహం. ట్రాఫిక్ సీఐ స్పందించాలని విజ్ఞప్తి.

Srinivasulu, Madanapalle
Published on: 9 Nov 2026 1:28 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య.. పట్టింపు లేని వైనం!

Madanapalle: మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ తీవ్రమవుతున్నా, దాన్ని నియంత్రించాల్సిన ట్రాఫిక్ పోలీసుల పనితీరుపై ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పట్టణంలో రహదారుల విస్తరణ లేక ఒకవైపు వాహనాల రద్దీ పెరుగుతుంటే, మరోవైపు రోడ్లపైనే వాహనాలను ఇష్టానుసారంగా నిలిపివేస్తున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో వాహనాల నిలుపుదలతో ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ప్రైవేట్ బస్సులు ఎక్కడపడితే అక్కడ నిలిపివేస్తుండటంతో పట్టణంలో ట్రాఫిక్ సమస్య మరింత తీవ్రమవుతోంది. బస్సుల ఇష్టారాజ్యపు నిలుపుదలకు అడ్డుకట్ట వేసి, ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసులపై లేదా? అన్న ప్రశ్నలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ వాహనాలను నిలిపివేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ట్రాఫిక్ పోలీసులపై ఉంది. ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా కేవలం కార్యాలయానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితులను పరిశీలించాల్సిన అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్‌ను నియంత్రించలేకపోతే ట్రాఫిక్ వ్యవస్థను ఎలా క్రమబద్ధీకరిస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదా? ట్రాఫిక్ సీఐ ఇప్పటికైనా స్పందించి అక్రమ పార్కింగ్, ప్రైవేట్ బస్సుల ఇష్టారాజ్యపు నిలుపుదలపై చర్యలు తీసుకుంటారా? లేక సమస్య ఇలాగే కొనసాగుతుందా? అనేది వేచి చూడాలి.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle