Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ కష్టాలు: పట్టించుకునే నాథుడే లేరా?
Madanapalle: మదనపల్లె పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిత్తూరు బస్టాండ్ మార్గంలో సాయంత్రం వేళల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. పోలీసులు స్పందించాలని స్థానికుల డిమాండ్.
Madanapalle: మదనపల్లెలో ట్రాఫిక్ కష్టాలు: పట్టించుకునే నాథుడే లేరా?
మదనపల్లె: మదనపల్లె పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిత్తూరు బస్టాండ్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో ముఖ్యంగా సాయంత్రం వేళ వాహనాల రాకపోకలు పెరగడంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభిస్తోంది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ముఖ్యంగా సాయంత్రం సమయంలో వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోతున్నా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు తగినంత మంది పోలీసులు కనిపించడం లేదని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎక్కడ ఉన్నారో.. ఈ సమస్యను ఎవరు పట్టించుకుంటారో అర్థంకాని పరిస్థితి నెలకొంది.
ఇప్పటికైనా సంబంధిత ట్రాఫిక్ అధికారులు స్పందించి ఆర్టీసీ బస్టాండ్ నుంచి చిత్తూరు బస్టాండ్ మార్గంలో, ముఖ్యంగా సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సిబ్బందిని అందుబాటులో ఉంచి వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.




