Madanapalle: సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

Madanapalle: అక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI
Published on: 1 Oct 2026 7:45 PM IST
Madanapalle
X

Madanapalle: సీఎం చంద్రబాబు, నిర్మలా సీతారామన్ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రత

మదనపల్లె: అక్టోబర్ 2న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు ఇతర ప్రముఖుల రాక సందర్భంగా మదనపల్లెలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్,. గారు. తెలిపారు.

గురువారం మదనపల్లెలోని శ్రీదేవి కల్యాణ మండపంలో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. హెలిప్యాడ్, సభా వేదిక, వీఐపీల రూట్ మ్యాప్ వద్ద పటిష్ట నిఘా ఉంచుతూ, సామాన్య ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు.

పోలీసులు, బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు సమన్వయంతో అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో బందోబస్తు కు వచ్చిన పోలీసు అధికారులు పాల్గొన్నారు.

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI

N. SURYA PRAKASH RAJU, ROYCHOTI