Madanapalle: మదనపల్లె రాజకీయాలు వేరు, స్నేహం వేరు; అభ్యర్థుల పలకరింపు!
Madanapalle: మదనపల్లె నామినేషన్ల కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ చైర్మన్ అభ్యర్థులు శ్రీరామ్ చినబాబు, జింక వెంకట చలపతి ఆప్యాయంగా పలకరించుకుని సోదరభావం చాటుకున్నారు.
Madanapalle: మదనపల్లె రాజకీయాలు వేరు, స్నేహం వేరు; అభ్యర్థుల పలకరింపు!
Madanapalle: అన్నమయ్య జిల్లాలో పలుచోట్ల టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్య వాగ్వాదాలు, ఘర్షణలు చోటుచేసుకుంటుండగా.. మదనపల్లెలో మాత్రం రెండు పార్టీల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థులు సోదరభావంతో పలకరించుకోవడం ఆసక్తికరంగా మారింది.
వైసీపీ అభ్యర్థి జింక వెంకట చలపతి నామినేషన్ దాఖలు చేసిన అనంతరం, టీడీపీ అభ్యర్థి శ్రీరామ్ చినబాబు నామినేషన్ వేసేందుకు ఎన్నికల అధికారి వద్దకు చేరుకున్నారు.
ఈ సమయంలో ఇద్దరూ ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని షేక్హ్యాండ్ ఇచ్చుకున్నారు. అధికారం ఐదేళ్లే.. స్నేహం శాశ్వతం అనే సందేశాన్ని తమ పలకరింపుతో చాటారు.
రాజకీయాల్లో పోటీ సహజమే అయినప్పటికీ, వ్యక్తిగతంగా సోదరభావంతో మెలగాలని ఇద్దరు అభ్యర్థులు వ్యవహరించిన తీరు అక్కడున్న వారిని ఆకట్టుకుంది. ఎన్నికల వేళ ఈ సన్నివేశం మదనపల్లెలో చర్చనీయాంశంగా మారింది.




