Madanapalle: మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్‌కు సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు

Madanapalle: మున్సిపల్ చైర్మన్‌గా గెలిచిన గుండ్లపల్లి శ్రీరామ్ చినబాబును కలిసి శుభాకాంక్షలు తెలిపిన రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి.

Srinivasulu, Madanapalle
Published on: 4 Nov 2026 7:31 PM IST
Madanapalle
X

Madanapalle: మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్‌కు సుదర్శన్ రెడ్డి శుభాకాంక్షలు

మదనపల్లె: రాజంపేట పార్లమెంట్ తెలుగు యువత ఉపాధ్యక్షులు సుదర్శన్ రెడ్డి మదనపల్లె మున్సిపల్ చైర్మన్‌గా విజయం సాధించిన గుండ్లపల్లి శ్రీరామ్ కుమార్ (చినబాబు)ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మదనపల్లె పట్టణ అభివృద్ధికి శ్రీరామ్ చినబాబు కృషి చేయాలని ఆకాంక్షించారు. పట్టణంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని తెలిపారు.

చైర్మన్‌గా మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మొటుకు శివ, సోముశేఖర్ రెడ్డి, బాబు రెడ్డి, ఆనంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle