Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు!

Madanapalle: అన్నమయ్య జిల్లా: మదనపల్లె టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు ఖరారయ్యారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నేతలు టీడీపీలో చేరారు.

Srinivasulu, Madanapalle
Published on: 17 Oct 2026 12:17 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీరామ్ చినబాబు!

Madanapalle: మదనపల్లె మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా కూటమి అధిష్ఠానం టీడీపీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబును కేటాయించడంతో ఆయన నివాసం వద్ద సందడి నెలకొంది. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చి శ్రీరామ్ చినబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

అనంతరం మదనపల్లె 30వ వార్డుకు చెందిన మాజీ వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి ముబీనా, సలీం శ్రీరామ్ చినబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు టీడీపీ కండువా కప్పుకొని పార్టీలో చేరి చినబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ పరిణామంతో స్థానిక రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle