Madanapalle: మదనపల్లి మున్సిపల్ నేతలకు శ్రీనివాస మోడీ శుభాకాంక్షలు

Madanapalle: మదనపల్లి మున్సిపల్ చైర్మన్ శ్రీరామ్ కుమార్ (చినబాబు), వైస్ చైర్మన్ ఎల్లంపల్లి ప్రశాంత్‌లకు బీజేపీ యువమోర్చా నేత శ్రీనివాస మోడీ అభినందనలు.

Srinivasulu, Madanapalle
Published on: 23 Nov 2026 5:28 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లి మున్సిపల్ నేతలకు శ్రీనివాస మోడీ శుభాకాంక్షలు

మదనపల్లి: మదనపల్లి మున్సిపల్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీరామ్ కుమార్ (చినబాబు), వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎల్లంపల్లి ప్రశాంత్‌కు BJYM తిరుపతి జిల్లా ఇన్‌చార్జ్ శ్రీనివాస మోడీ హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

భారతీయ జనతా పార్టీ తరఫున ఎన్నో సంవత్సరాలుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ, పార్టీ అభివృద్ధికి కృషి చేసిన ఎల్లంపల్లి ప్రశాంత్ మున్సిపల్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనుండటం సంతోషకరమని శ్రీనివాస మోడీ పేర్కొన్నారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్, వైస్ చైర్మన్లు మదనపల్లి పట్టణ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle