Madanapalle: మదనపల్లె వాల్మీకి సర్కిల్‌లో మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు!

Madanapalle: మదనపల్లె చిత్తూరు బస్టాండ్ వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు. పాల్గొన్న కౌన్సిలర్ పూలకుంట్ల వాణి, హరిబాబు దంపతులు.

Srinivasulu, Madanapalle
Published on: 10 Nov 2026 1:58 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లె వాల్మీకి సర్కిల్‌లో మహర్షి విగ్రహానికి ప్రత్యేక పూజలు!

Madanapalle: మదనపల్లె చిత్తూరు బస్టాండ్ సమీపంలోని వాల్మీకి సర్కిల్‌లో వాల్మీకి మహర్షి విగ్రహానికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో 24వ వార్డు కౌన్సిలర్ పూలకుంట్ల వాణి, పూలకుంట్ల హరిబాబు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా పూలకుంట్ల హరిబాబు మాట్లాడుతూ వాల్మీకి మహర్షి మహోన్నతమైన వ్యక్తిత్వం, ఆదర్శ జీవనం, రామాయణ మహాకావ్యం ద్వారా సమాజానికి అందించిన సందేశాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమన్నారు. వాల్మీకి మహర్షి ఆశయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు. మహర్షి జయంతి, ప్రత్యేక పూజా కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle