Madanapalle: మదనపల్లెలో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్

Madanapalle: మదనపల్లె మున్సిపాలిటీ 7, 9వ వార్డుల స్వతంత్ర అభ్యర్థులుగా సోనాకంటి శశి కుమార్, కే. లక్ష్మి బహుజన యువసేన, కార్మిక సంఘాల మద్దతుతో నామినేషన్లు దాఖలు చేశారు.

Srinivasulu, Madanapalle
Published on: 18 Oct 2026 4:14 PM IST
Madanapalle
X

Madanapalle: మదనపల్లెలో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్

మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా సోనాకంటి శశి కుమార్, 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కే. లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు. బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ ప్రతిపాదనతో పాటు సీనియర్ కార్మిక నాయకులు కృష్ణమూర్తి, ముబారక్ సంపూర్ణ మద్దతుతో వీరు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ కార్యక్రమంలో కార్మిక నాయకులు స్వయంగా పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

ఈ సందర్భంగా బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్, కార్మిక నాయకులు మాట్లాడుతూ.. 7, 9వ వార్డుల్లో ప్రజలు, కార్మికులు ఎదుర్కొంటున్న మౌలిక సదుపాయాల కొరతతో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. సామాన్య ప్రజలు, కార్మికుల గొంతుకగా నిలుస్తూ వార్డుల సమగ్ర అభివృద్ధికి అభ్యర్థులు కృషి చేస్తారని తెలిపారు.

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజాసేవకు ప్రాధాన్యత ఇస్తారని పేర్కొన్నారు. సోనాకంటి శశి కుమార్, కే. లక్ష్మిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వార్డు ప్రజలు, ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన యువసేన నాయకులు, సీనియర్ కార్మిక నాయకులు కృష్ణమూర్తి, ముబారక్, కార్యకర్తలు, యువత, స్థానిక ప్రజలు పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle