Madanapalle: పొన్నేటిపాళ్యంలో సర్పంచ్ అభ్యర్థి అమల విస్తృత ప్రచారం

Madanapalle: మదనపల్లి సమీప పొన్నేటిపాళ్యం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ముదివేటి అమల విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ.

Srinivasulu, Madanapalle
Published on: 29 Nov 2026 8:48 PM IST
Madanapalle
X

Madanapalle: పొన్నేటిపాళ్యంలో సర్పంచ్ అభ్యర్థి అమల విస్తృత ప్రచారం

మదనపల్లి: పొన్నేటిపాళ్యం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ముదివేటి అమల ఆదివారం రాత్రి విస్తృతంగా పర్యటించి ఓటర్లను కలుసుకున్నారు.

తనను సర్పంచిగా గెలిపిస్తే గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. రోడ్లు, డ్రైన్లు, వీధి లైట్లు వేయిస్తూ అనునిత్యం అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని చెప్పారు.

గ్రామ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని, ఓటర్లు తనకు మద్దతు ఇచ్చి ఆశీర్వదించాలని అమల విజ్ఞప్తి చేశారు.

Srinivasulu, Madanapalle

Srinivasulu, Madanapalle