Madanapalle: మదనపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
Madanapalle: మదనపల్లెలో వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను యువనేత హర్షవర్ధన్ రెడ్డి కేక్ కట్ చేసి, అన్నదానం నిర్వహించారు.
Madanapalle: మదనపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలు
మదనపల్లె: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జన్మదిన వేడుకలను మదనపల్లె నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించి పలువురికి అన్నప్రసాదం అందించారు. హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు.
ప్రజలకు, పార్టీకి ఆయన అందిస్తున్న సేవలు నిరంతరం కొనసాగాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని కోరుకున్నారు. ఆయన నాయకత్వం పార్టీ శ్రేణులకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.




